: అగ్నిప్రమాదం సంభవించిన సింధురత్నపై విచారణ పూర్తి


ఐఎన్ఎస్ సింధురత్న ప్రమాదంపై నౌకాదళాధికారులు విచారణ పూర్తి చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ముంబైతీరంలోని సింధురత్న జలాంతర్గామిలో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు నౌకాదళాధికారులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగుర్ని హెలికాప్టర్ ద్వారా రక్షించి చికిత్స అందజేశారు. దీంతో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నౌకాదళాధికారులు కమిటీని నియమించారు. ప్రమాదంపై వివరాలు వెల్లడించనప్పటికీ కమాండింగ్ అధికారి సహా ఇద్దరు అధికారులపై కోర్టు మార్షల్ విధించారు.

  • Loading...

More Telugu News