: రాజధానికి భూములెందుకు?...ఈ భవనాలు స్వాధీనం చేసుకోండి చాలు!: సీపీఎం రాఘవులు


రాజధాని పేరిట గుంటూరు జిల్లాలో సాగు భూములను ఎందుకు సేకరిస్తున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ప్రశ్నించారు. విజయవాడలో కరకట్ట ఆక్రమణలు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా కరకట్టను ఆనుకుని కట్టిన ఇంద్రభవనాలను స్వాధీనం చేసుకుంటే రాజధానిని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదని అన్నారు. కరకట్టను ఆనుకుని బడాబాబులు భారీ భవంతులను నిర్మించారని, వాటిపై పూర్తి వివరాలను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి అందజేస్తామని ఆయన తెలిపారు. ఇంద్రభవనాలను తలదన్నేలా నిర్మించిన ఈ భవనాల లోపలికి వెళ్లేందుకు, నదిలో విహరించేందుకు బోట్లను కూడా ఏర్పాటు చేసుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. అమెరికా బీచ్ లలోలా కరకట్టపై అద్భుతమైన కట్టడాలున్నాయని చెప్పిన ఆయన, వాటిని రాజ్ భవన్, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వాటికి ఉపయోగించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News