: ఇక ఇంటికి... 3 వికెట్ల తేడాతో భారత్ చిత్తు!


ముక్కోణపు సిరీస్ లో భాగంగా పెర్త్ లో జరిగిన వన్ డే క్రికెట్ పోటీలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టులో టేలర్ 82, బట్లర్ 67 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఆసీస్ తో తలపడనుంది. కాగా, అటు టెస్ట్ సిరీస్ లో, ఇటు ముక్కోణపు సిరీస్ లో ఓటమిపాలైన భారత జట్టు త్వరలో జరిగే ప్రపంచ కప్ పోటీల్లో ఘనమైన ప్రతిభ కనబరుస్తుందా? అన్న అనుమానాలు సగటు క్రికెట్ ప్రియులలో కలుగుతున్నాయి. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. టెస్టు సిరీస్ లోనూ పరాజయాలు వెక్కిరించగా, తాజాగా ట్రై సిరీస్ లోనూ నిరాశాజనక ఫలితం తప్పలేదు.

  • Loading...

More Telugu News