: ముగిసిన తిరుపతి ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు
తిరుపతి నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పదిమంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక బరిలో 13 మంది అభ్యర్థులు మిగిలారు. ఫిబ్రవరి 13న తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించిన టీడీపీకి, అభ్యర్థిని దింపి కాంగ్రెస్ షాకిచ్చింది. చివరిగా ఈరోజు టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. టీడీపీ తరపున సుగుణమ్మ అభ్యర్థిగా ఉన్నారు.