: జయంతి వ్యాఖ్యలను ఖండించిన దిగ్విజయ్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు వినలేదనే నాడు తనను పర్యావరణ శాఖ నుంచి తప్పించారంటూ జయంతి నటరాజన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. "ప్రభుత్వ పనితీరులో సోనియాగాంధీ గానీ, రాహుల్ గానీ జోక్యం చేసుకున్నారనడం పూర్తిగా తప్పు. అసలు ఓ మంత్రిత్వ శాఖలో కలగజేసుకోవాలనుకుంటే ఆ శాఖకు రాహుల్ మంత్రే కాగలరు" అని సింగ్ పేర్కొన్నారు.