: సద్దాం హుస్సేన్ భవంతులను నేలమట్టం చేసిన ఐఎస్ మిలిటెంట్లు


ఇరాక్ లో సద్దాం హుస్సేన్ భవంతులను ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పేల్చి వేసింది. తిక్రిత్ పట్టణంలో ఆయనకు చెందిన 9 విలాసవంతమైన భవంతులను ఐఎస్ మిలిటెంట్లు నేలమట్టం చేసినట్టు ఇరాక్ భద్రత విభాగం అధికారి ఒకరు తెలిపారు. సద్దాం ప్రాభవం కొనసాగిన కాలంలో మొత్తం 76 అందమైన భవంతులు నిర్మించారు. వాటిలో కృత్రిమ సరస్సులు, పార్కులు ఏర్పాటు చేశారు. ఈ భవంతుల్లో అత్యధికం టైగ్రిస్ నదీ తీరంలో నిర్మించారు. సద్దాంను బందీగా పట్టుకున్న తర్వాత ఈ భవంతులను ఇరాకీ వర్గాలు ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలుగా వినియోగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News