: చేతులెత్తేసిన భారత బ్యాట్స్ మెన్... భారమంతా బౌలర్లదే!


పెర్త్ వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయిన భారత బ్యాట్స్ మెన్ 48.1 ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. 200 స్కోరుకే టీమిండియా ఆలౌటైంది. ఇక గెలుపు భారం బౌలర్లపై పడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ధోనీ సేనకు బ్యాటింగ్ అప్పజెప్పింది. భారత ఓపెనర్లు అజింక్యా రహానే (73), శిఖర్ దావన్ (38) నిలకడగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. 83 పరుగుల వద్ద శిఖర్ ధావన్ తొలి వికెట్ గా వెనుదిరగడంతో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (8), రైనా (1), అంబటి రాయుడు (12) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (17), స్టువర్ట్ బిన్నీ (7), రవీంద్ర జడేజా (5), అక్షర్ పటేల్ (1)లు వరుసగా పెవిలియన్ చేరారు. చివర్లో మోహిత్ శర్మ (7 నాటౌట్) సహకారంతో మహ్మద్ షమీ (25) చెలరేగడంతో టీమిండియా స్కోరు 200 మార్కుకు చేరుకుంది. ఇంగ్లాండ్ కు 201 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా ఇక ఫీల్డింగ్ కు దిగనుంది.

  • Loading...

More Telugu News