: కొనసాగుతున్న వికెట్ల పతనం... ఆరో వికెట్ కోల్పోయిన భారత్
చావో రేవో తేల్చుకోవాల్సిన వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఓపెనర్ అజింక్యా రహానే మినహా మిగిలిన వారంతా వచ్చీ రావడంతోనే వికెట్లు పడేసుకుని పెవిలియన్ చేరారు. కుదురుకుంటాడనుకున్న అంబటి రాయుడు(12) సైతం నిరాశపరచగా, అతడి వెనకే అజింక్యా రహానే(73), స్టువర్ట్ బిన్నీ( 7)లు ఒకరి వెంట మరొకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. జట్టు ఆరు వికెట్లు కోల్పోయాక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(15*)తో రవీంద్ర జడేజా(3*) జతకలిశాడు. 41 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 160 పరుగులు చేసింది.