: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ... సింగిల్ తో సరిపెట్టుకున్న రైనా


పెర్త్ వన్డేలో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. తొలుత నిలకడగానే బ్యాటిగ్ ప్రారంభించిన శిఖర్ ధావన్ (38) ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కాగా, భారత ఆశాకిరణం విరాట్ కోహ్లీ(8) కీలకమైన ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. కోహ్లీ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో క్రిస్ వోక్స్ క్యాచ్ పట్టడంతో సురేష్ రైనా ఔటయ్యాడు. దీంతో అంబటి రాయుడు ఓపెనర్ అజింక్యా రెహానే(63 బ్యాటింగ్)తో జతకలిశాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News