: పొగమంచు గుప్పిట్లో శంషాబాద్, గన్నవరం ఎయిర్ పోర్టులు... విమాన సర్వీసులకు అంతరాయం


తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన విమానాశ్రయాలు శంషాబాద్, గన్నవరం ఎయిర్ పోర్టులను పొగమంచు కప్పేసింది. దీంతో నేటి ఉదయం రెండు విమానాశ్రయాల్లో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన పలు విమానాలు కూడా చాలా ఆలస్యంగా చేరుకోనున్నాయి. అదేవిధంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యంగా చేరుకోనున్నాయి.

  • Loading...

More Telugu News