: చంద్రబాబు సహా మంత్రులంతా యోగా బాటలో... ఏపీ సచివాలయం ఖాళీ!


మరో నెల రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బిజీబిజీగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్యమంత్రి, మంత్రులు, బ్యూరోక్రాట్లు లేక వెలవెలబోతోంది. 'ఇన్నర్ ఇంజినీరింగ్ ఫర్ జాయ్ ఫుల్ లివింగ్' అంటూ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. సైబర్ కన్వెన్షన్ హాలులో ఈ కార్యక్రమం జరగగా, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వెళ్లారు. ఇంకేముంది, హైదరాబాదులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు జగ్గీ వాసుదేవ్ వెంట పడ్డారు. దీంతో, సచివాలయంలో సెలవు వాతావరణం కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ కార్యక్రమం సెలవు దినాల్లో నిర్వహిస్తే బాగుండేదని, పని దినాల్లో పెట్టడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, అధికారులు మూడు రోజుల పాటు శిక్షణ శిబిరానికి అంకితం కావడం వల్ల పరిపాలనా సంబంధ వ్యవహారాల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News