: రాహుల్ వైఖరేమీ బాలేదు: సోనియాకు జయంతి నటరాజన్ లేఖ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఖరిపై పార్టీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ... పార్టీ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం వెల్లడైంది. రాహుల్ వైఖరిపై అసంతృప్తి నేపథ్యంలో జయంతి నటరాజన్ పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత్రికి లేఖాస్త్రం సంధించిన జయంతి, నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అధినేత్రికి లేఖ రాసిన విషయం వెల్లడవడం, వెనువెంటనే మీడియా సమావేశం వార్తలతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ నేతగా కొనసాగుతూ వస్తున్న జయంతి పార్టీని వీడితే, కాంగ్రెస్ కు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News