: యువకుడి వేధింపులతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యాయత్నం... ధర్మవరంలో ఘటన
యువకుడి వేధింపులతో మనస్తాపం చెందిన ఏడో తరగతి బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న సదరు బాలిక ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన యువకుడు హరి, ఏడో తరగతి చదువుతున్న బాలికను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో కలత చెందిన బాలిక నిన్న ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం బాలిక ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై కేసు నమోదు చేయాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.