: హలో బ్రదర్... బాగున్నారా?: ’గాలి‘కి జగన్ పలకరింపు.... ముక్తసరిగా సరిపెట్టిన జనార్దన్ రెడ్డి


అవినీతి కేసుల్లో చిక్కుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిల మధ్య నిన్న నాంపల్లి కోర్టులో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తనకు ఎదురుపడ్డ గాలి జనార్దన్ రెడ్డిని జగన్ ‘‘హలో బ్రదర్... బాగున్నారా?’’ అంటూ పలకరించారు. జగన్ పలకరింపుకు అంతగా స్పందించని ఆయన ‘‘ఆ... బాగున్నాను’’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా జగన్ అంత ఆప్యాయంగా పలకరిస్తే, గాలి మాత్రం ముక్తసరిగా స్పందించడానికి ఓ కారణముందిలెండి. దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్, గాలిల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. వైఎస్ఆర్ తనకు తండ్రితో సమానమని, జగన్ సోదరుడి లాంటి వారని నాడు గాలి మీడియా ముందే ప్రకటించారు. అయితే కేసుల్లో చిక్కుకున్న అనంతరం ఓ సందర్భంలో పార్లమెంట్ గేటు ముందు ‘‘గాలి జనార్దన్ రెడ్డి ఎవరు?’’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన జగన్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News