: కేసీఆర్... రోగుల ఉసురూ తప్పదు!: చెస్ట్ ఆస్పత్రి తరలింపుపై పొన్నాల ధ్వజం


హైదరాబాదులోని ఎర్రగడ్డలో కొనసాగుతున్న చెస్ట్ ఆస్పత్రిని తరలించేందుకు జరుగుతున్న తంతుపై టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ‘పింఛన్ల కోత నేపథ్యంలో వృద్ధులు, వితంతువుల వేదనకు కారణంగా నిలిచిన కేసీఆర్ కు తాజాగా రోగుల ఉసురూ తగలక తప్పదు. చెస్ట్ ఆస్పత్రి తరలింపు కోసం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదంటే కేసీర్ తీరుపై ఉద్యమిస్తాం’’ అని పొన్నాల అన్నారు. పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి నిన్న ఆయన చెస్ట్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆందోళన చేస్తున్న వైద్యులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పొన్నాల విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News