: ఆ విమానం ప్రమాదానికి గురైంది...అందరూ మృతి చెందారు: మలేషియా


గత ఏడాది 239 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎంహెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ ప్రమాదంలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టలేదని ప్రకటనలో స్పష్టం చేసింది. 2014 మార్చి 8న ఎంహెచ్ 370 విమానం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ విమానం కోసం వివిధ దేశాలతో మలేషియా శక్తివంచన లేకుండా గాలించింది. అయినప్పటికీ విమాన శకలాలు కానీ, మృతదేహాలు కానీ లభ్యం కాలేదు. అసలు ఈ విమానం ప్రమాదానికి గురైన ఏ ఆధారమూ లభించలేదు. ఆ రోజు ఆకాశంలో పేలుడు సంభవించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఏడాదిపాటు గాలింపు చేపట్టిన మలేషియా అధికారులు విమానం ప్రమాదానికి గురై ఉంటుందని, ప్రయాణికులంతా మృతి చెంది ఉంటారని ప్రకటించారు. మృతుల కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించనున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News