: 2016 ఒలింపిక్స్ లో స్వర్ణం తెస్తే 75 లక్షల నజరానా
2016వ సంవత్సరంలో జరగనున్న రియో ఒలింపిక్స్ లో క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్ లో స్వర్ణపతకం తెచ్చిన క్రీడాకారులకు 75 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని నేడు పునఃసమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొనాలని భావించే క్రీడాకారుల్లో స్పూర్తిని రగిలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.