: సంగీత దర్శకుడు చక్రిది సహజ మరణమే!: ఫోరెన్సిక్ నివేదిక


ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న అనుమానాలన్నింటికీ చెక్ పడింది. ఆయనది సహజ మరణమేనని, అస్థికల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. చక్రి అస్థికలను పరిశీలించి, పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ మేరకు నివేదిక రూపొందించారు. చక్రి మరణంపై అనుమానం ఉందంటూ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అత్త తదితరులే చక్రిని చంపారంటూ భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రతిగా, అతని తల్లి, తమ్ముడు, అక్క కూడా ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కోడలే చంపిందని చక్రి తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News