: ప్రధాని మోదీని కలిసిన ఇండో-బ్రిటీష్ ఫిలింమేకర్
ఇండో-బ్రిటీష్ ఫిలింమేకర్ గురిందర్ చద్ధా (55) భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన తదుపరి చిత్రం కోసం లొకేషన్లు వెదుకుతూ ఆమె ప్రస్తుతం భారత్ లోనే ఉన్నారు. దేశ విభజన అంశంపై ఆమె చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'బెండ్ ఇట్ లైక్ బెక్ హామ్' చిత్రంతో గురిందర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. లారీ కొలిన్స్, డొమనిక్ లాపియర్రే సంయుక్త రచన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీతో గురిందర్ ఏం చర్చించారన్నది తెలియరాలేదు.