: కొత్త విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్... నియామకంపై కాంగ్రెస్ అభ్యంతరం!


భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా జైశంకర్ నియమితులయ్యారు. నిన్నటివరకు ఈ పదవిలో ఉన్న సుజాతా సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. క్యాబినెట్ నియామకాల కమిటీతో ఒకరోజు ముందు సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అకస్మాత్తుగా శంకర్ పేరును ఖరారు చేశారు. అయితే, సుజాతా సింగ్ పదవీకాలం ముగియకుండానే కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా శంకర్ ను నియమించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికిప్పుడు జైశంకర్ కు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు కూడా ఈ నియామకం గురించి తెలియదని సమాచారం. 2013 యూపీఏ-2 హయాంలోనే జైశంకర్ ను నియమించాల్సింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా ఆయన పేరే అనుకున్నప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం ప్రకారం సుజాతా సింగ్ ను నియమించారట.

  • Loading...

More Telugu News