: ఓటర్ గుర్తింపు కార్డుల విషయంలో కిరణ్ బేడీకి ఈసీ క్లీన్ చిట్
వేరు వేరు అడ్రస్ లతో రెండు ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న విషయంలో ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్ధి కిరణ్ బేడీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు ఆమె ఓటు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే తమ సిబ్బంది పొరబాటు కారణంగా రెండు ఓటర్ గుర్తింపు కార్డులున్నట్టు వచ్చిందని ఈసీ తెలిపింది. అసలు సమాచారాన్ని తమ వెబ్ సైట్ లో అప్ డేట్ చేయలేదని చెప్పింది. కాగా, బేడీకి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం రికార్డు ద్వారా ఈ ఉదయం తెలిసింది.