: వచ్చే ఏడాది భారత్ లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్
వచ్చే ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ భారత్ లో జరగనుంది. ఈ మేరకు దుబాయిలో నిన్న భేటీ అయిన ఐసీసీ తీర్మానించింది. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఇతర సిరీస్ లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్ లో పరిగణనలోకి తీసుకోరు. అయితే, ఐసీసీ ఈవెంట్ లో స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడే కెప్టెన్లపై మాత్రం నిషేధం అమలు కానుంది. ఈ మేరకు పలు అంశాలపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.