: మంత్రి హరీశ్ రావుకు మిచిగాన్ వర్శిటీ ఆహ్వానం
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. మార్చి లేదా ఏప్రిల్ లో అమెరికా రావాలని కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ ప్రతినిధులు మంత్రికి ఓ లేఖ రాశారు. మిషన్ కాకతీయ లక్ష్యాలను ఇక్కడ వివరించాలని లేఖలో కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ఆహ్వానించిన మిచిగాన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా పర్యటన తేదీలు త్వరలో తెలుపుతామన్నారు.