: 29 గ్రామాల రైతులకు రుణ విముక్తి పథకం: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని ప్రతిపాదిత ప్రాంతం గుంటూరు జిల్లా తుళ్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 29 గ్రామాల రైతులకు రుణవిముక్తి పథకం వర్తింపజేస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల రైతులకు ఏకకాలంలో రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. కాగా, రాజధాని ప్రాంతంలో అక్రమ లేఅవుట్లపై సీఆర్డీఏ సహాయ కమిషనర్ తో కలసి మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.