: తాలిబన్లకు, ఐఎస్ కు తేడా చెప్పిన వైట్ హౌస్


ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు, ఇస్లామిక్ స్టేట్ కు మధ్య తేడా ఉందని చెబుతోంది అమెరికా. తాలిబాన్లు సాయుధ తిరుగుబాటుదారులని, ఐఎస్ ఓ టెర్రరిస్టు గ్రూపు అని వైట్ హౌస్ వర్గీకరించింది. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ డిప్యూటీ సెక్రటరీ ఎరిక్ షుల్జ్ మాట్లాడుతూ, తాలిబాన్లు సాయుధ తిరుగుబాటుదారులని, ఐఎస్ ఓ టెర్రరిస్టు గ్రూపు అని వివరించారు. తాము టెర్రరిస్టు గ్రూపులకు మినహాయింపులు ఇవ్వబోమని, కఠిన వైఖరి అవలంబిస్తామని హెచ్చరించారు. గతంలో అమెరికా ఓ సైనికుడిని విడిపించుకునేందుకు తాలిబాన్ మిలిటెంట్ ను వదిలేసిన ఘటనను, జోర్డాన్ సర్కారు తమ పైలట్ ను ఇస్లామిక్ స్టేట్ నుంచి విడిపించుకునేందుకు ఓ టెర్రరిస్టును వదిలేసిన ఘటనతో పోల్చుతూ మీడియా అడిగిన ప్రశ్నకు షుల్జ్ పైవిధంగా బదులిచ్చారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం కోసం పోరాడుతున్నారని వివరణ ఇచ్చారు. తాము టెర్రరిస్టులతో రాజీపడబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News