: ఆసీస్ పిచ్ లు ఇలాగే స్పందిస్తే మనకే మంచిది: ద్రావిడ్


ఆస్ట్రేలియాలో పిచ్ లు మునుపటిలా లేవని, కాస్త మందగించాయని బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. భారత్ తో తాజా టెస్టు సిరీస్ లో ఆ విషయం వెల్లడైందని, పిచ్ లు పేస్ కు పెద్దగా సహకరించలేదని వివరించాడు. ఇప్పుడున్న విధంగానే స్పిన్ కు అనుకూలిస్తే వరల్డ్ కప్ లో టీమిండియాకు లాభిస్తుందని విశ్లేషించాడు. ఈ సిరీస్ లో బౌన్స్ కూడా కనిపించలేదని అన్నాడు. ఈ నేపథ్యంలో, భారత్ తన బౌలింగ్ కూర్పులో ముగ్గురు స్పిన్నర్లకు కూడా చోటు కల్పించవచ్చని తెలిపాడు. ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా క్వార్టర్ ఫైనల్స్ చేరుతుందని ధీమాగా చెప్పాడు. ఆ తర్వాత 'మూడు మంచిరోజులు' మనవైతే కప్ కూడా మనదవుతుందని అన్నాడు. ఇక, ఆయా జట్ల విజయావకాశాల గురించి చెబుతూ, ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లకు 60 నుంచి 70 శాతం వరకు కప్ నెగ్గే చాన్సులున్నాయని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News