: ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బు తీసుకోండి... పార్టీ వాలంటీర్లకు కేజ్రీవాల్ సూచన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిసారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తొలుత కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చే డబ్బు తీసుకుని తమకే ఓటేయమని ప్రజలను కేజ్రీ కోరారు. ఇప్పుడు పార్టీ వాలంటీర్లకు కూడా అటువంటి సూచనే చేశారు. "ప్రతిపక్షాలు మా పార్టీ వాలంటీర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని సంప్రదించే ప్రతి ఒక్కరినీ నిరాకరించవద్దని వాలంటీర్లకు చెప్పాను. పైసే లేకర్ స్టింగ్ కర్లో. ఈ సందేశాన్ని అందరికీ విస్తరించండి" అని ట్విట్టర్ లో కేజ్రీ పేర్కొన్నారు. అంతేకాదు, ప్రతిపక్షాలు డబ్బు ఇచ్చేటప్పుడు రికార్డు చేసి వారి బండారాన్ని బయటపెట్టాలని కూడా ఆయన కోరారు.