: తాను డిప్యూటీ సీఎం కావడం ఇష్టంలేకే... కొందరు ఆరోపణలు చేస్తున్నారు: కడియం
తప్పులు చేసే తప్పుడు వ్యక్తిని తాను కాదని... చిత్తశుద్ధి కలిగిన వ్యక్తినని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తాను ఎలాంటి తప్పైనా చేస్తే... ఉరిశిక్షకు సైతం సిద్ధమని చెప్పారు. కొందరు తనపై కారుకూతలు కూస్తున్నారని... తాను డిప్యూటీ సీఎం కావడం భరించలేకే ఆరోపణలు చేస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుపై మండిపడ్డారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రాలను సమర్పించి కడియం శ్రీహరి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని మోత్కుపల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా, తాను మాదిగ ఉప కులానికి చెందిన వ్యక్తిని అని కడియం స్పష్టం చేశారు.