: ఏకంగా వైట్ హౌసుకే వచ్చి ఒబామా తల తీస్తారట!


ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను బెదిరిస్తోంది. అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోనే ఒబామా తల తీస్తామని హెచ్చరించింది. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. బందీగా పట్టుకున్న ఓ కుర్దు సైనికుడిని ప్రదర్శిస్తూ, ఓ ఐఎస్ జిహాదీ ఈ హెచ్చరిక చేశాడు. "ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఒబామా... మేం అమెరికా వస్తాం. వైట్ హౌస్ లో నీ తల తెంచుతాం. అమెరికాను ముస్లిం రాజ్యంగా మార్చు" అని పేర్కొన్నాడు. అంతేగాకుండా, ఫ్రాన్స్, దాని సోదరి బెల్జియం కూడా మూల్యం చెల్లించకతప్పదని అన్నాడు. కారు బాంబులు, పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తామని, తలలు తీస్తామని హెచ్చరించాడు. అనంతరం, బందీగా ఉన్న కుర్దు సాయుధుడి పీక కోయగా, అక్కడ ఉన్న సమూహం హర్షం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News