: బాబూ... మీ ఆఫీస్ వాస్తు బాగోలేదు: ఏపీ సీఎంకు కేసీఆర్ సూచన


ఏపీ, తెలంగాణ సీఎంలిద్దరికీ వాస్తుపై అపార నమ్మకం. తాము చేసే ప్రతి కార్యానికీ వాస్తు దోషాలను చూసుకుని మరీ వారు ముందడుగేస్తారు. ఈ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మరింత పట్టుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరువురు నేతలు గవర్నర్ సమక్షంలో దాదాపు గంటకు పైగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్, చంద్రబాబుకు ఓ హెచ్చరిక చేసినట్లు తెలిసింది. ‘‘మీ కార్యాలయం వాస్తు బాగా లేదు, త్వరలో వాస్తు దోషాలను సరిచేసుకోండి’’ అంటూ కేసీఆర్, చంద్రబాబుకు సూచించారట. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని ఎల్ బ్లాకులో చంద్రబాబు కార్యాలయం ఏర్పాటైంది. తొలుత సౌత్ హెచ్ బ్లాకును కేటాయించినా, వాస్తు బాగా లేదన్న కారణంగా, చంద్రబాబు తన కార్యాలయాన్ని ఎల్ బ్లాకులో ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు కార్యాలయం కోసం ఏపీ సర్కారు దాదాపు రూ.20 కోట్లను ఖర్చు చేసింది కూడా. తాజాగా కేసీఆర్ హెచ్చరికతో సందిగ్ధంలో పడ్డ చంద్రబాబు, తన కార్యాలయం వాస్తుపై మరోసారి పరిశీలన చేయించాలని అనుచరగణానికి ఆదేశాలు జారీ చేశారట.

  • Loading...

More Telugu News