: యాక్సిస్ బ్యాంకులో అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన ఫైళ్లు, ఫర్నిచర్


హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1 లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో యాక్సిస్ బ్యాంకు కార్యాలయం తగలబడిపోయింది. కాంప్లెక్స్ లోని రెండో అంతస్తులో చెలరేగిన మంటల కారణంగా బ్యాంకులోని ఫర్నిచర్ తో పాటు కీలక ఫైళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం సంభవించిన అంతస్తులో బ్యాంకు శాఖతో పాటు కాల్ సెంటర్, ఇతర కార్యాలయాలున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News