: ఎన్టీఆర్ స్థాయిని అమాంతం పెంచే సినిమా టెంపర్: పూరీ జగన్నాథ్


వంశీ ఓ పాయింట్ చెప్పాడు, బాగుంది, వింటావా? అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. టెంపర్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, మంచి కథ ఎవరు చెప్పినా వింటానని అన్నానని, వంశీ కథ విని అద్భుతంగా ఉందని చెప్పానని అన్నారు. ఆంధ్రావాలా సినిమా ఎన్నో అంచనాలతో తీశానని, అయితే అది నిరాశను మిగిల్చిందని అన్నారు. ఫిబ్రవరి 13 తో ఆ సినిమాకి, టెంపర్ కి మధ్య సినిమాలన్నింటినీ మర్చిపోతారని అన్నారు. కొత్త తారక్ ను చూపిస్తున్నానని పూరీ తెలిపారు. సినిమాలో హీరో, విలన్, కమెడియన్, ఐటెం కూడా ఎన్టీఆరేనని ఆయన పేర్కొన్నారు. టెంపర్ సినిమా తరువాత చాలా సినిమాలు రిలీజవుతాయనీ, అయినా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎంతో ఎత్తులో ఉంటాడని పూరీ తెలిపాడు. ఈ సందర్భంగా, నిర్మాత దివంగత జానకీరాం, సంగీత దర్శకుడు దివంగత చక్రికి నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News