: ప్రతి ఖాతాలో 15 వేల రూపాయలు వేయాలి: లాలూ


జన ధన యోజన ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, జనధన్ యోజన పథకం కింద ఓపెన్ చేసిన ప్రతి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హామీ నిలుపుకోకుంటే మార్చి 15న ర్యాలీ చేపడతానని ఆయన తెలిపారు. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తానని ఆయన చెప్పారు. జనధన్ యోజన ఖాతాల్లో తక్షణం ఆ మొత్తాన్ని జమ చేయాలని లాలూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News