: మోదీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తా: అన్నా హజారే


అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరొందిన అన్నా హజారే ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. రాలెగావ్ సిద్ధీలో ఆయన మాట్లాడుతూ, అవినీతిపై పోరాడతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మోదీ మర్చిపోయారని అన్నారు. అది గుర్తు చేసేందుకే తాను బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని హజారే స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో అవినీతిపై పోరాటం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని ఆయన విమర్శించారు. లోక్ పాల్ విషయంలో ఎలాంటి ప్రగతీ చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమం కోసం కార్యకర్తలను సమీకరించుకుంటున్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News