: విదేశీ వాణిజ్యవిధానం వెల్లడించడంలో లేటైంది: నిర్మలా సీతారామన్
2014 నుంచి 2019 సంవత్సరాలకు సంబంధించిన విదేశీ వాణిజ్య విధానాన్ని (ఫారిన్ ట్రేడ్ పాలసీ) త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఫారిన్ ట్రేడ్ పాలసీని విడుదల చేయడంలో జాప్యం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానం వెల్లడైతే ఎగుమతులకు ఊతం వస్తుందని ఆమె పేర్కొన్నారు. వాణిజ్య విధానంలో స్పష్టత లేకపోవడం వల్ల ఎగుమతుల్లో మార్పు కనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.