: నిఠారీ హంతకుడు సురీందర్ కోలీ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు
నిఠారీ వరుస హత్యల హంతకుడు సురీందర్ కోలీకి విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. 2005-06 మధ్య కాలంలో జరిగిన ఐదు హత్యలకు సంబంధించి గతంలో అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. గతేడాది మీరట్ లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన తరుణంలో, నేరస్థుల క్షమాభిక్ష సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటే వారి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో కోలీ సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నాడు. దాంతో అతని ఉరిశిక్ష రెండుసార్లు వాయిదాపడింది.