: రెసిడెన్షియల్ స్కూల్లో బాలిక ప్రసవం... పసికందు హత్య


ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా స్కూలు విద్యార్థినిపై దాష్టీకం చోటుచేసుకుంది. కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, బాలిక గర్భందాల్చింది. రెసిడెన్షియల్ స్కూల్ లోనే సూపరింటిండెంట్ ప్రసవం జరిపించారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి పసికందును చంపి పారేశాడు. ఆ నోటా ఈ నోటా పాకిన ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో, కొరియా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హాస్టల్ సమీపంలోని నది సమీపంలో పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో, నిందితుడితో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ సూపరింటిండెంట్ ను సస్పెండ్ చేయగా, ఆమె భర్త పరారీలో ఉన్నాడు. బాలిక తనపై అత్యాచారం జరిగినట్టు, హాస్టల్ లో ప్రసవించినట్టు, పసికందును నిందితుడు చంపేసినట్టు వాంగ్మూలమిచ్చింది.

  • Loading...

More Telugu News