: సునందా పుష్కర్ కేసులో అమర్ సింగ్ కు సమన్లు


కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేతను సిట్ విచారించబోతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) సమన్లు పంపింది. త్వరలో ఈ కేసులో శశిథరూర్, సునంద కుమారుడిని విచారిస్తామని సిట్ తెలిపింది. మరోవైపు, భార్య సునంద కేసులో తనను విచారించిన నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లకు థరూర్ స్పందించారు. రాజీనామా చేసేదిలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News