: టీమిండియా ఈసారి కూడా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశిస్తున్నా: మందిరా బేడీ
త్వరలో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్-2015 కోసం ఎదురుచూస్తున్నానని నటి, హోస్ట్, డిజైనర్ మందిరా బేడీ తెలిపింది. ఈ ఏడాది కూడా భారత జట్టు ట్రోఫీని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. "ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానిలానే, ఈసారి కూడా భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశిస్తున్నా. మనం డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇటీవలి సిరీస్ లలో ఎలా ఆడామన్నది పెద్ద విషయం కాదు. ఆస్ట్రేలియా జట్టులా మనం విజయ పరంపరను కొనసాగిస్తామని భావిస్తున్నా" అని మందిర అంటోంది. ప్రతి వరల్డ్ కప్ లానే ఇది కూడా గుర్తుండిపోయే వరల్డ్ కప్ అవుతుందని చెబుతోంది. 1994లో 'శాంతి' అనే టీవీ షోతో పాప్యులర్ అయిన మందిరా... 2003, 2007లో ఐసీసీ వరల్డ్ కప్ కు టీవీలో హోస్టుగా వ్యవహరించింది.