: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ కు చేరిన సానియా జోడీ


మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా దూసుకుపోతోంది. మిక్స్ డ్ డబుల్స్ లో సానియా, బ్రూనో సొరెస్ జోడీ సెమీస్ కు చేరింది. సానియా జోడీ క్వార్టర్ ఫైనల్స్ లో 6-2, 6-2తో కాసే డెల్లాక్వా, జాన్ పీర్స్ ద్వయంపై విజయం సాధించింది. సెమీస్ లో సానియా జోడీ ఎవరితో తలపడేది ఇంకా తేలలేదు. ఈ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్... మార్టినా హింగిస్ జతగా ప్రస్థానం సాగిస్తున్నాడు. పేస్-హింగిస్ జోడీ ఆండియా లవకోవా-అలెగ్జాడర్ పేయా జంటతో క్వార్టర్స్ ఆడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News