: వరల్డ్ కప్ అధికారిక 'యాప్' ను లాంచ్ చేసిన ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ కప్ సందర్భంగా అధికారిక యాప్ ను బుధవారం లాంచ్ చేసింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లే నుంచి ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు 2015 వరల్డ్ కప్ కు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. టోర్నీ షెడ్యూల్ మొదలుకొని ఆటగాళ్ల వివరాలు, ప్రైజ్ మనీ, వేదికలు, తాజా క్రికెట్ వార్తలు, క్విజ్ పోటీలు, క్రికెట్ కాంటెస్టులు... ఇలా ఎన్నో అంశాలు ఈ యాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. మరికొన్ని రోజుల్లో మెగా ఈవెంట్ ఆరంభం కానుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.