: ప్రముఖ నటుడి భూమి కబ్జా... కేసు నమోదు
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి, నటుడు అయిన దేవదాస్ కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గరైంది. దాంతో దేవదాస్, రాజీవ్ లు నేటి ఉదయం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దేవదాస్ కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవదాస్ తదితరులు దుండగులను వెళ్లిపొమ్మని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో, పోలీసులను ఆశ్రయించారు.