: మలుపు తిరిగిన సీఐ భార్య మృతి వ్యవహారం... కావాలనే చంపాడంటున్న బంధువులు!
అనంతపురం జిల్లాలో గతరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న సీఐ అర్జున్ నాయక్ దంపతులపై ఓ వాహనం దూసుకుపోగా, ఆయన భార్య మృతి చెందడం తెలిసిందే. అయితే, ఆమెను భర్త అర్జున్ నాయక్ కావాలని చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ తీరుపై పిల్లలు, బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో సీఐ అర్జున్ నాయక్ కు స్వల్పగాయాలయ్యాయి. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలున్నాయని మృతురాలి బంధువులు మీడియాకు తెలిపారు. వృత్తి పరంగానూ అర్జున్ నాయక్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.