: ‘చాగల్లు‘ ఘటనాస్థలి వద్ద మంత్రులు శిద్ధా, పల్లె... ప్రమాదంపై ఆరా!


ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్ద అగ్నికి ఆహుతైన బస్సును ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సందర్శించారు. నిన్న సాయంత్రం 40 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి హైదరాబాదు బయలుదేరిన వోల్వో బస్సు (పర్వీన్ ట్రావెల్స్) చాగల్లు వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన బస్సును పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై వారు అందుబాటులో ఉన్న ప్రయాణికులతో పాటు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బస్సులో రవాణా చేస్తున్న పేలుడు పదార్ధాల కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న వార్తల నేపథ్యంలో మంత్రుల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News