: భద్రతా మండలిలో భారత్ కు అమెరికా మద్దతును వ్యతిరేకిస్తున్న పాక్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు అమెరికా మద్దతిస్తుందంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడంపై పాకిస్థాన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. పాక్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ, ఐరాస భద్రతా మండలిలో భారత్ కు అమెరికా మద్దతు ఇవ్వడమంటే ఆగ్నేయాసియాలో శాంతి, స్థిరత్వానికి పాతర వేయడమేనని వ్యాఖ్యానించారు. అంతేగాక, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో భారత్ కు సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా తమదేశం వ్యతిరేకిస్తోందని తెలిపారు.