: ఇండియాలో తొలి వై-ఫై నగరంగా కోల్ కతా... రెండు నెలల్లో పూర్తిస్థాయి సేవలు!
భారతదేశంలో తొలి పూర్తిస్థాయి వై-ఫై నగరంగా కోల్ కతా చరిత్ర సృష్టించనుంది. నగరంలోని మొత్తం 144 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పరిధిలో ప్రైవేట్ భాగస్వామ్యంతో వై-ఫై సేవలు మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వచ్చేనెల 5న కోల్ కతా పార్క్ స్ట్రీట్ నుంచి వై-ఫై సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ లోగా వై-ఫై సేవలు నగరమంతటా అందుబాటులోకి రావచ్చని అంచనా. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ టాప్ యూజర్లు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అటు, నగరవ్యాప్తంగా వై-ఫై సేవలు అందించేందుకు ముంబై కార్పొరేషన్ అడుగులు వేస్తుండగా, బెంగళూరులో చాలా ప్రాంతాల్లో, హైదరాబాదులో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే వై-ఫై సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.