: చైనాను కీర్తిస్తున్న దలైలామా
టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా చైనాను కీర్తిస్తున్నారు. చైనా ఓ గొప్పదేశమంటున్నారు. సుదీర్ఘ చరిత్ర చైనా సొంతమని, అక్కడి ప్రజలు కష్టజీవులని కొనియాడారు. అందుకే చైనాను అభిమానిస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న దలై లామా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మరో ప్రశ్నకు జవాబిస్తూ... భారత్, చైనా దేశాలు సఖ్యత కలిగివుండడం ఒక్క టిబెట్ కే కాదని ఆసియా మొత్తానికి కూడా అవసరమేనని అన్నారు. అంతకుముందు, విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా శాంతి సందేశాన్ని వ్యాపింపజేయాలని పిలుపునిచ్చారు.