: సముద్రంలో ఆ 92 మంది ఇక జలసమాధే!
గత నెలలో జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ఏషియా విమాన ప్రమాద ఘటనలో మృతదేహాల అన్వేషణను నిలిపివేస్తున్నట్లు ఇండోనేసియా మిలటరీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ విమానంలో మొత్తం 162 మంది ఉండగా, ఇప్పటి వరకు 70 మృతదేహలను వెలికితీశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు, మృతదేహాల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో, బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురయ్యారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సెర్చ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మరో 92 మంది మృతదేహాలను వెలికితీయాల్సి వుంది. ఇక వారంతా జలసమాధి అయినట్టు మలేషియా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించనుంది. గత సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బంది సహా 162 మందితో ఎయిర్ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం విదితమే.