: ఒబామా భారత పర్యటన బృందంలో మంగళూరు యువతి
భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బృందంలో కర్ణాటక యువతి కూడా ఉన్నట్టు తెలిసింది. మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించిన ఒబామా దంపతులు నిన్న సౌదీ అరేబియా వెళ్లారు. ఒబామా వెంట అమెరికాకు చెందిన భారీ బృందమే భారత్ వచ్చింది. ఈ బృందంలో కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శిల్పా హెగ్డే కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కొన్నేళ్లుగా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న శిల్పా, ఒబామా భారత పర్యటన బృందంలో చోటు దక్కించుకుంది.