: ఎన్‌టీవీపై కేంద్రం నిషేధం... కోర్టుకెక్కిన యాజమాన్యం


అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు ఎన్‌టీవీ ప్రసారాలను నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ టీవీ ఛానల్ యాజమాన్యం 'రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్' హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ సంస్థ డెరైక్టర్ టి.రమాదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమాన్ని 2012లోనే నిలిపేశామని, ఇప్పుడు నిషేధం విధించడం సరికాదని ఆమె కోర్టుకు వివరించారు. గతంలో ఎన్‌టీవీలో రాత్రి 11.30 గంటలకు 'సినీకలర్స్' పేరుతో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ లోని పాటల్లో అశ్లీలత ఉంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించి ఈ నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News